160 రూపాయలకే అన్నీ.. కొత్త నిబంధనలతో సామాన్యులకు తగ్గనున్న భారం

Update: 2020-01-13 08:17 GMT

టీవీ ప్రేక్షకులకు ట్రాయ్‌ తీపి కబురు అందించింది. దీంతో ఇకపై టీవీ ప్రేక్షులకు జేబుపై పడే భారం తగ్గనుంది. కేబుల్‌ టీవీ టారిఫ్‌ ఆర్డర్‌కు సవరణలు చేస్తూ.. కొత్త నిబంధనలను ట్రాయ్‌ వెలువరించింది. ట్రాయ్‌ కొత్త నిబంధనలతో వినియోగదారులపై పెను భారం తగ్గనుంది. 160 రూపాయలకే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని ట్రాయ్‌ తెలిపింది. బేసిక్ ప్యాక్‌, అలాకార్ట్‌ నిబంధనలను ట్రాయ్‌ రద్దు చేసింది. ఇకపై 130 రూపాయలకే 2 వందల ఫ్రీ చానెల్స్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. వీటికి ప్రసారభారతి ఛానెల్స్‌ అదనంగా ఇవ్వనున్నారు. వినియోగదారులపై భారం పడకూడదనే నిబంధనలు సవరించామని ట్రాయ్ చైర్మన్‌ ఆర్‌.ఎస్. శర్మ తెలిపారు. సుప్రీం కోర్టు ఉత్వర్వులను చదివి వినిపించారు ఆర్‌.ఎస్.శర్మ. క్యారేజ్ ఫీజు కూడా ఒక సెట్ టాప్ బాక్స్‌పై 20 పైసలు మించరాదని ట్రాయ్‌ నిర్దేశించింది. రెండో కనెక్షన్‌కు 40 శాతం మాత్రమే వసూలు చేయాలన్నారు. చానెల్‌ ప్లేస్‌మెంట్‌ మార్చేముందు వినియోగదారుల అనుమతి తప్పనిసరన్నారు ట్రాయ్ చైర్మన్‌ ఆర్‌.ఎస్.శర్మ.

Similar News