దీపిక చలవతో నెలకు రూ.6,000..

Update: 2020-01-13 08:29 GMT

 

ఓ సినిమా ప్రభుత్వాన్ని కదిలించింది. 'ఆమె' పడుతున్న వేదనలో కొంతైనా పాలు పంచుకుంటామని రూ.6,000లు పెన్షన్ రూపంలో అందిస్తానంటోంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛపాక్ చూసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాసిడ్ బాధితులకు పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. వారికి నెలకు రూ.5,000 నుంచి రూ.6,000 పెన్షన్ అందించడానికి నిర్ణయించింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. యాసిడ్ బాధితులు గౌరవంగా బతికేందుకు వారికి ప్రతినెలా 5వేల నుంచి 6 వేలు అందిస్తామన్నారు. దీనిపై కేబినెట్‌లో ప్రతిపాదన తీసుకు వచ్చి ఖచ్చితంగా అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. హీరోయిన్‌గా అత్యున్నత స్థాయిలో ఉన్న దీపికా పదుకోన్ ఈ పాత్రలో నటించడం సినిమాకు ప్లస్ అయింది. ఇన్‌డైరక్ట్‌గా బాధితుల బ్రతుకుల్లో వెలుగులు నిపింది. ప్రభుత్వాన్ని కదిలించి వారి జీవన భృతికి తోడ్పడింది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు ప్రజల్లో, ప్రభుత్వంలో చైతన్యాన్ని తీసుకొస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఛపాక్ నిరూపించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉత్తరాఖండ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News