జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌ రేవ్‌ పార్టీలో కొత్త కోణం

Update: 2020-01-13 13:55 GMT

జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌ రేవ్‌ పార్టీలో కొత్త కోణం వెలుగు చూసింది. పబ్‌ను సిగ్నోవా ఫార్మా కంపెనీ బుక్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ సేల్స్‌ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్‌ ఉద్యోగుల కోసం ఫార్మా కంపెనీ యాజమాన్యం రేవ్‌ పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ప్రతి ఏటా రేవ్‌ పార్టీని ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ప్రసాద్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 22 మంది యువతులను నగ్ననృత్యాలు, వ్యభిచారం కోసం తెచ్చినట్లు పోలీసులు నిర్దారించారు. సినిమా ఛాన్సుల కోసం వచ్చిన యువతులను వ్యభిచార రొంపిలోకి దింపినట్లు సమాచారం. పట్టుబడ్డ యువతులంతా నెల్లూరుకు చెందినవారిగా పోలీసులు చెబుతున్నారు.

Similar News