తెలంగాణలో జరుగుతున్నమున్సిపల్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ ఫోకస్ పెంచింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అభ్యర్థులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరును ఆయన తెలుసుకుంటున్నారు. అదే సమయంలో కొన్నిచోట్ల రెబల్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా కేటీఆర్ దృష్టి సారించారు. ప్రచార వ్యూహాలపై అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు.