విరసం నూతన కార్యదర్శి ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్

Update: 2020-01-18 07:17 GMT

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఖాసింను పోలీసులు అరెస్టు చేశారు. విరసం నూతన కార్యదర్శి కూడా అయిన ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఖాసిం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2016లో నమోదైన కేసులో భాగంగానే.. సోదాలు జరిపినట్టు పోలీసులు చెపుతున్నారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసిం A-2గా ఉన్నారు. ఓయూలోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఖాసింను పోలీసులు అరెస్టు చేశారు.

Similar News