అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు.. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ కూడలిలోని ఎన్‌టీఆర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం భారీ బైక్ నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లును వెంటనే ఉపసంహరించుకుని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అటు మంగళగిరిలోనూ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. పలు విద్యా సంస్థలను మూసివేయాలని జేఏసీ కోరింది. అయితే శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఉద్యమకారులను.. ఆంక్షల పేరుతో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు.