ఏపీ పేద రాష్ట్రం అన్న జగన్ 5 కోట్లు ఇచ్చి లాయర్‌ను ఎందుకు నియమించారు: తులసిరెడ్డి
ఏపీ పేద రాష్ట్రం.. మనకి శాసనమండలి అవసరమా అన్న జగన్.. రైతులకు వ్యతిరేకంగా వాదించే లాయర్‌కు 5 కోట్లు ఎలా ఇచ్చారని.. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పారని ఎద్దేవా చేశారు. మండలిలో మంచి చెబుతుంటే జగన్‌కు నచ్చడంలేదు. అందుకే రద్దు చేస్తున్నారని తులసిరెడ్డి అన్నారు. జగన్ తన తండ్రికి వెన్నుపోటు పొడిచి మండలిని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం ఉన్న చోటే పాలన రాజధాని ఉండాలంటున్న జగన్‌కు వికేంద్రీకరణ బిల్లు, CRDA బిల్లు ఎందుకన్నారు తులసిరెడ్డి.