భీమ్‌గల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

Update: 2020-01-25 12:43 GMT

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్‌లలో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 వార్డులకు గాను.. ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 11 వార్డులను టీఆర్ఎస్ దక్కించుకుంది.

Similar News