సీఏఏపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సీఏఏపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఏఏ వల్ల దేశ ప్రజలకు నష్టమేంటో చూపించాలని సవాల్ విసిరారు. మజ్లిస్‌తో పొత్తుపెట్టుకుని మత రాజకీయాలు చేస్తోంది టీఆర్‌ఎస్సేనని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వెళ్తోందని నేతలన్నారు.