భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎమ్‌ఎఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2020-02-01 16:34 GMT

భారతదేశ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లలేదని ఐఎమ్‌ఎఫ్‌ పేర్కొంది. గత ఏడాది భారతదేశం తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొందని తెలిపింది. బ్యాంకింగేతర రంగంలో ఒడుదొడుకులు, జీఎస్టీ-నోట్ల రద్దు తదితర నిర్ణయాల కారణంగా దేశ ఆర్థిక రంగం కుదుపులకు లోనైందని వివరించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంటుందని I.M.F అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 6.5 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది.

భారత ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని IMF తెలిపింది. భారీ ఆర్థిక లోటుకు దారి తీసే పరిస్థితులు భారతదేశంలో లేవని పేర్కొంది. ఐతే ఆదాయం లక్ష్యం కంటే తక్కువగా ఉండడమే ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. భారతదేశ వృద్ది రేటు దిగజారితే అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని వివరించింది.

Similar News