తెలంగాణలో రైతు సహకార ఎన్నికలు.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

Update: 2020-02-15 08:11 GMT

తెలంగాణలో రైతు సహకార ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్ననం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను కూడా ప్రెస్టేజ్ గా తీసుకోవటంతో సాధారణ ఎన్నికలను తలిపంచే స్థాయిలో రైతు సహాకార ఎన్నికలకు ఫోకస్ పెరిగింది. ఇన్నాళ్లు క్యాంపుల్లో మకాం వేసిన వారు అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

మరోవైపు సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ హత్యతో రైతు సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత కారణమైంది. సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత రెండు రోజులుగా ఎర్కారం గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య ఘర్షణ వాతారణం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ నాయకులే హత్య చేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. పాత పగలు కూడా కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News