టీవీ5 ఛానెల్ నిలివేతపై స్పందించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. మీడియాపై ఆంక్షలు మంచిది కాదన్న ఆయన... ప్రసారాలు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. ఏ ఛానెల్ ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందో.. ఆ ఛానెల్‌కు ఆదరణ పెరుగుతుందన్నారు. మీడియాను వైఎస్ ఎప్పుడూ నియంత్రించలేదని గుర్తు చేశారు. మీడియాను నియంత్రించడం జగన్ ప్రభుత్వం మానుకోవాలన్నారు.