పాతికేళ్లు రాజకీయాల్లో ఉండడానికే వచ్చాను: పవన్ కళ్యాణ్

Update: 2020-02-20 23:29 GMT

పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడానికే వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గెలుపోటములకు భయపడబోనని, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూనే ఉంటానని చెప్పారు. ఢిల్లీలో భారతీయ విద్యార్థి సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన తనకు చిన్నప్పటినుంచే ఉండేదని పవన్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ తనకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితోనే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. రాజకీయాల్లో తక్షణ ఫలితాలు ఆశించవద్దని, దీర్ఘకాల లక్ష్యాలు ఏర్పరచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించకపోయినా సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషించామన్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోని సుగాలి ప్రీతి కేసును తాము టేకప్ చేశామని, ఆ తర్వాతే ప్రభుత్వం స్పందించిందని గుర్తు చేశారు.

 

Similar News