ఎవరి ఇళ్లు వారికి ఎంత ముఖ్యమో.. వారి గల్లీ కూడా అంతే ముఖ్యం: హరీష్ రావు

Update: 2020-02-25 17:31 GMT

కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టం ప్రజలకు భరోసా కల్పిస్తుందన్నారు ఆర్థికశాఖామంత్రి హరీష్ రావు. పట్టణ ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లా సదాశివ పేట 16వ వార్డులో హరీష్ రావు పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 75 గజాల లోపు ఇల్లు కట్టాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ తో 250 గజాల్లోపు ఇల్లు కట్టుకోవచ్చని అన్నారు. పట్టణ పరిశుభ్రతపై ప్రజలు శ్రద్ధ చూపించాలని కోరారు. ఎవరి ఇల్లు వారికి ఎంత ముఖ్యమో.. వారి గల్లీ కూడా అంతే ముఖ్యమని అన్నారు.

Similar News