ఢిల్లీలో సీఏఏ వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎంపీ ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అల్లర్లను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న కిషన్‌రెడ్డి.. సున్నిత అంశం కాబట్టి.. సంయమనం పాటిస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన ఓవైసీ.. అల్లర్లు కంట్రోల్ చేయలేకపోవడం బీజేపీ సర్కారు వైఫల్యమన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఏ అల్లర్లు కంట్రోల్ చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.