ఎన్ఆర్‌సీ బీజేపీ పార్టీ కార్యాలయంలో తయారు చేసిన చట్టం కాదు : మురళీధర్ రావు

Update: 2020-02-29 10:20 GMT

NRC అనేది బీజేపీ పార్టీ కార్యాలయంలో తయారు చేసిన చట్టం కాదన్నారు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. అసోంలో ఎన్నార్సీ విధానాన్ని సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోందని అన్నారు. ప్రస్తుతం తమ దృష్టి CAA పైనే వుందని.. NRC గురించి ఆలోచించడం లేదని తెలిపారు. అటు NPR గురించి కూడా బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అందరితో చర్చించిన తర్వాతే NPR అమలు చేస్తామని మురళీధర్ రావు స్పష్టం చేశారు.

Similar News