సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శిస్తూ.. కడప జిల్లా రైల్వే కోడూరు టీడీపీ నేత నరసింహ ప్రసాద్ వినూత్న శైలిలో నిరసన తెలిపారు. పిచ్చి తుగ్లక్ వేషధారణలో రైల్వేకోడూరు మార్కెట్ వీధుల్లో తిరుగుతూ నిరసన తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయంపై మండిపడి ఆయన.. ఇది పిచ్చితుగ్లక్ నిర్ణయమంటూ ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ చేస్తోన్న పిచ్చి పరిపాలన చూసి.. 670 ఏళ్ల క్రితం చనిపోయిన పిచ్చి తుగ్లక్ మళ్లీ లేచి వచ్చినట్లు తెలిపారు. తనను ఇంతగా తలుచుకోవడానికి కారకుడైన తన వారసుడు జగన్ ఎక్కడున్నాడంటూ.. అందరిని ప్రశ్నించాడు. శుక్రవారం కావడం వల్ల ఆయన అందుబాటులో లేరని తెలిసిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ సర్కారు పాలన పిచ్చి తుగ్లక్ కంటే ఘోరంగా ఉందని సింబాలిక్‌గా చెప్పేందుకే ఈ వేషినట్లు తెలిపారు నరసింహ ప్రసాద్.
తాను కేవలం రాజధానిని మారిస్తే పిచ్చి తుగ్లక్‌గా పేరు పొందానని, ప్రస్తుతం సీఎం జగన్ అయితే.. ఏకంగా రాజధానితో పాటు రేషన్‌కార్డులు, పించన్లు సైతం తీసేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి పిచ్చి పనుల వల్ల.. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు నరసింహ ప్రసాద్. ప్రజలు మనశ్శాంతిగా నిద్రపోవడం లేదని, రోజుకొక కొత్త సమస్యతో ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శించారు.