Karunakar Reddy : భగవద్గీతను అవమానించిన కరుణాకర్ రెడ్డి.

Update: 2026-03-06 08:15 GMT

మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎన్నిసార్లు హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మాట్లాడితే తాను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను అని చెబుతూనే.. కంకణం కట్టుకొని మరీ హిందూ ధర్మాన్ని పలచన చేయాలని చూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూను కల్తీ చేసే మహా పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పాపం పండి అసలు నిజాలు బయటకు వస్తుంటే ఓర్వలేక రక రకాల సింపతీ రాజకీయాలు మొదలుపెట్టారు. పోనీ అవైనా సరిగా చేస్తున్నారంటే అందులో కూడా హిందూ ధర్మాన్ని అత్యంత దారుణంగా అవమానిస్తూనే ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి.

తాజాగా తాను ఏదో పెద్ద వేదాంతిని అయినట్టు భగవద్గీతను రచించారు. కానీ అది చూసినవారికి ఎవరికైనా షాక్ అనిపించక మానదు. ఎందుకంటే భగవద్గీతను కూడా అత్యంత దారుణంగా అవమానించారు కరుణాకర్ రెడ్డి. వాస్తవ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. కానీ కరుణాకర్ రెడ్డి రాసిన భగవద్గీతలో ఒక్కటంటే ఒక్క శ్లోకం కూడా లేదు. పైగా దాన్ని 26 పేజీలకు కుదించి రాశారు. అందులోనూ ఎక్కువగా ఆయన సుత్తి ఉండటం మహా దారుణం. తన సొంత డబ్బా కొట్టుకోవడానికి అది రాసినట్టు ఉంది తప్ప అది భగవద్గీత అంటే ఎవరూ నమ్మను గాక నమ్మరు. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ ఇలాంటి తక్కువ పేజీలు ఉన్న భగవద్గీతను అసలే రాయలేదు.

పైగా దాన్ని 98 లక్షల ముద్రణలు చేయించాను అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే భవిష్యత్తు హిందూ తరాలకు భగవద్గీత అంటే 26 పేజీలది మాత్రమే అని.. అందులో ఎలాంటి శ్లోకాలు ఉండవని ఎలాంటి తాత్పర్యాలు కూడా లేవని చెప్పదలుచుకున్నారా. ఇది ఒక రకంగా హిందూ సమాజాన్ని భవిష్యత్ తరాలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది కానీ హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్నట్టు ఎలా అవుతుంది. ఇప్పటికే తిరుమల ప్రతిష్టను దారుణంగా తగ్గించిన చరిత్ర భూమన కరుణాకర్ రెడ్డికి దక్కింది. ఇప్పుడు భగవద్గీతను కూడా అవమానిస్తూ ఇలాంటి పనులు చేయడం ఏంటని యావత్ హిందూ సమాజం మొత్తం కరుణాకర్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Tags:    

Similar News