బ్రేకింగ్.. హైదరాబాద్‌లో కోవిడ్-19.. అధికారకంగా ప్రకటించిన కేంద్రప్రభుత్వం
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి శరీరంలో డాక్టర్లు కరోనా వైరస్ గుర్తించగా.. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.