రోడ్డు ప్రమాదాల నివారణకు కామారెడ్డి పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. నో హెల్మెట్, నో పెట్రోల్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులకు పెట్రోల్ పొయ్యొద్దని నిర్ణయించారు. కారులో వచ్చేవారు కూడా సీటు బెల్టు ధరించి వస్తేనే బంకుల్లో పెట్రోలు పోస్తున్నారు. పోలీసుల సహకారంతో పెట్రోల్ బంకుల యజమానులు ఈ ప్రక్రియను చేపట్టారు.