టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి: కేటీఆర్

Update: 2020-03-02 15:18 GMT

TRS ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌. స్వయంగా రైతైన కేసీఆర్‌.. సీఎంగా ఉన్నందునే.. రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల్లో గెలిచిన చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌లతో తెలంగాణ భవన్‌లో భేటీ అయిన కేటీఆర్.. రైతు సంక్షేమ కార్యక్రమాలను రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రైతు భీమా, రైతు బంధు లాంటి ప్రత్యేక పథకాలను తొలిసారిగా ప్రవేశపెట్టింది సీఎం కేసీఆర్‌ మాత్రమే అన్నారు. రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు కేటీఆర్‌.

Similar News