పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత.. బలవంతంగా భూసేకరణ

Update: 2020-03-02 17:34 GMT

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడులో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవిన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తాము నివాసం వుంటున్న భూముల్ని ఎలా స్వాధీనం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అంతేకాదు, రెవిన్యూ, పోలీస్ సిబ్బందిపైనా డీజిల్ పోశారు. అయినా, ఘటనాస్థలానికి భారీగా తరలివచ్చిన పోలీసులు, రెవిన్యూ ఉన్నతాధికారులు.. దగ్గరుండి ఇళ్లను ధ్వంసం చేయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Similar News