మాన్సాస్ ట్రస్ట్ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక్ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం వైఖరి వింతగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు, దేవాలయం భూములపై ప్రభుత్వం కన్నేసిందని.. అందుకే దొడ్డి దారిన అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమించడం మంచిది కాదని.. దాతల భూములు ఆలయానికే చెందాలని అభిప్రాయపడ్డారు. ట్రస్టు నిబంధనల ప్రకారం ఆడవాళ్లు పదవి చేపట్టకూడదన్నారు. అసలు జీవోలో ఏముందో బయట పెట్టకపోతే న్యాయపోరాటం చేస్తాను అన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.