CAA, NRCపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది వాస్తవమే అన్నారు సీఎం కేసీఆర్. దీనిపై సభలో ఒక రోజంతా ప్రత్యేకంగా చర్చించి.. వందకు వంద శాతం తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. తప్పుని తప్పని ధైర్యంగా చెబుతామన్నారు. CAA చట్టంలో అనేక అనుమానాలున్నాయని.. దీనిపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు కేసీఆర్. తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని.. ఇక దళితులు, పేదలకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.