బీజేపీ-జనసేన కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతాయి : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

Update: 2020-03-08 17:05 GMT

బీజేపీ-జనసేన కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతాయి అన్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. సీఎం జగన్ నిఘా యాప్ ను ఆవిష్కరించడం ఎన్నికల ఉల్లంఘనే అని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఉండగా వైసీపీ నిఘా పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నగదు, మద్యం ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని పిలుపు ఇచ్చారు. ఓటర్లను ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి అన్నారు.

Similar News