ఏపీలో కుల ధృవీకరణ పత్రాలపై జగన్ ఫొటో ముద్రించడం విమర్శలకు తావిచ్చింది. ఇదెక్కడి ప్రచారం అంటూ తెలుగుదేశం అభ్యంతరం చెప్తోంది. కులం, నివాసం, పుట్టినతేదీ ధృవీకరణ పత్రాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర సరిపోతుందన్నది కొందరి వాదన. సంక్షేమ పథకాలకు ఇచ్చే కార్డులు, ఇతరత్రా వాటిపై సీఎం ఫొటో వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని.. వ్యక్తిగత ధృవీకరణ పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నిస్తున్నారు.