స్థానిక ఎన్నికల వేళ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. అన్న క్యాంటీన్ షెడ్‌ను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండటంపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. రాత్రి అక్కడే పడుకొని నిరసన తెలిపారు. 9 నెలలుగా అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం మూసివేయడంతో.. దాతల సహకారంతో క్యాంటీన్ పక్కన టెంట్ వేసి ప్రతిరోజు పేదలకు అన్నం పెడుతున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా షెడ్డు వేశారంటూ కూల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. చేతనైతే పేదల కడుపు నింపాలి..కానీ షెడ్డు కూల్చొద్దని చెప్పారు.