గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.