పథకం ప్రకారమే ప్రత్యర్థి పార్టీ నేతలపై వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారని.. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తుంటే ఈసీ నిద్రపోతుందా అని రామకృష్ణ ప్రశ్నించారు. మాచర్ల హత్యాయత్నం ఘటనలో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని నిలదీశారు.