జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు విముక్తి

Update: 2020-03-13 22:07 GMT

కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు కొద్దిగా రిలీఫ్ లభించింది. గృహ నిర్బంధం నుంచి ఆయన విడుదల అయ్యారు. ఏడు నెలల తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ నుంచి విముక్తి పొందారు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ లభించిందని, ఇకపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఫరూక్‌పై గృహ నిర్బంధాన్ని ఎత్తివేసినట్లు ఉదయమే ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌ పరిపాలనా విభాగం కూడా ఫరూఖ్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐతే, ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీల విడుదలపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఆర్టికల్-370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు విధించారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పీడీపీ, కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చే శారు. ప్రజావ్యవస్థను దెబ్బతీస్తున్నారని, అసత్య ప్రచా రంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం ఆరోపించింది. అలాగే, ఆ ముగ్గురు నాయకులపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం ప్రకారం ఎలాంటి విచారణ లేకుండానే రెండేళ్లు నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ ఆదేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరిస్థితులకు అనుగుణంగానే నాయకులపై ప్రజాభద్రత చట్టాన్ని ప్రయోగించామని వివరణ ఇచ్చింది.

Similar News