కరోనాపై దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. సీఎం జగన్ మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ ఎమర్జెన్సీని పట్టించుకోకుండా పారాసిటమాల్ వేసుకుంటే చాలు అనడం ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకుంటే చంద్రబాబును విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ-జనసేనలు ఫిర్యాదు చేసిన సంగతి జగన్‌కు తెలిదా అన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తే.. జైల్లో పెడతారని భయపడుతున్నారా అని నిలదీశారు.