ఏపీ నుంచి రాజ్యసభకు ముద్దాయిలను వైసీపీ పంపుతోందని ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని రాజ్యసభకు ఎందుకు పంపుతున్నారో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లి పరువు తీయొద్దని ఎద్దేవాచేశారు. వైసీపీ నేతల గొంతులు రాజ్యసభలో లేస్తాయా అని వర్లరామయ్య ప్రశ్నించారు.