సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ధోరణి మారాలి అని సూచించారు. సీఎం ఎవరైనా పరిధి ఉన్నంత వరకే పని చేయాలన్నారు. సీఎం కదా తానే సర్వం అనుకుంటే కుదరదన్నారు. ఎవరైనా సరే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేయాలని సూచించారు. ఎస్‌ఈసీని సీఎం సహా, మంత్రులంతా కులం పేరుతో విమర్శించడం సరైంది కాదని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు.