అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు: ఈటెల రాజేందర్

Update: 2020-03-18 19:54 GMT

తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. అయితే, రాష్ట్రంలో ఆరో కేసు నమోదైందని తెలిపారు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావదొద్దని ఈటెల సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపొందని అన్నారు. ఫంక్షన్లలో 200 మంది దాటకుందా చూసుకోవాలని విజ్ఙప్తి చేశారు. మనిషికి, మనిషికి కనీసం గజం దూరం పాటించాలని ఈటెల సూచించారు.

మరోవైపు ఈసారి సీతారాముల కల్యాణాన్ని ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు మంత్రి ఈటెల. హెల్త్ డిపార్ట్ మెంట్ కు సెలవులు రద్దు చేశామని తెలిపారు. ఇక, స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది బయట తిరగడానికి కాదని.. ఇళ్లలోనే ఉండాలని ఈటెల పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరాటపడుతోందని.. ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Similar News