నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు తొలిగాయి. దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో నలుగురు దోషులను శుక్రవారం ఉరితీయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తీహర్ జైల్లో అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉరి అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు ఎఎస్పీలను నియమించారు.
నిర్భయ కేసులో తనకు విధించిన మరణ శిక్షను జీవితఖైదుగా మార్చాలని దోషి పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. నేరం జరిగిన నాటికి తాను మైనర్ అన్న గుప్తా వాదనలకు కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు కొట్టివేసింది. దీంతో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. వీరిని శుక్రవారం ఉదయం 5.30కి ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసింది.