కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు అలర్టవుతున్నాయి. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. పోలీసుశాఖ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా రాచకొండ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్న విధానం అందర్నీ ఆకర్షస్తోంది. చేతులను ఎలా శుభ్రపరుచుకోవాలో చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.