ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు : ప్రధాని మోదీ
దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కరోనాపై మాట్లాడిన మోదీ.. దేశ ప్రజలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావలి. కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనను దైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి, కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు, ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం, ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదని వెల్లడించారు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలని సూచించారు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదని సూచించారు. సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు అని తెలిపారు. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దని.. ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు.