బ్రేకింగ్.. కరోనా ఎఫెక్ట్‌తో తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా

Update: 2020-03-20 15:47 GMT

కరోనా ఎఫెక్ట్‌తో తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షలను ఆయా బోర్డులు వాయిదా వేశాయి. తాజాగా టెన్త్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే శనివారం జరగాల్సిన పరీక్ష మాత్రం యథాతథంగా జరగనుంది. సోమవారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు మాత్రం వాయిదా పడ్డాయి. ఇక ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.

Similar News