విదేశాలనుంచి వచ్చిన వారిపై ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘాపెట్టడం లేదా?

Update: 2020-03-20 20:10 GMT

విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో... జనం భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దేశంలో ఎల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నా జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టడంలేదు. విదేశాలనుంచి వచ్చిన వారిపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టడంలేదని వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు విదేశాలనుంచి జిల్లాకు 309మంది వస్తే... 265మంది చిరునామాను మాత్రమే వైద్య సిబ్బంది గుర్తించగలిగారు. మిగిలిన వారు ఎక్కడున్నరన్న సమాచారం వారిదగ్గరలేదు.

Similar News