ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి

Update: 2020-03-21 20:28 GMT

ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్‌, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై ఈ వ్యాఖ్యలు చేశారు. మరణశిక్షను అమలు చేయడాన్ని ఆపాలని లేదా దానిపై తాత్కాలిక నిషేధం విధించాలని యుఎన్ అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.

ఢిల్లీలో 23 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం మరియు హత్య చేసి.. దోషులుగా తేలిన నలుగురిని ఉరి తీసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. నలుగురు దోషులు - ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26) ), అక్షయ్ కుమార్ సింగ్ (31) ను న్యూ ఢిల్లీ లోని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీశారు.

Similar News