కాశీకి వెళ్లి వస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది భక్తులను తెలంగాణ బోర్డర్‌లో ఆపివేశారు ఆదిలాబాద్ పోలీసులు. కరోనా వైరస్ అనుమానంతో వారిని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన 20 మంది, ఖమ్మంకు చెందిన 14 మంది, గుంటూరుకు చెందిన వారిలో 6 ఉన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా బస్సు డ్రైవర్, క్లీనర్‌తో సహ 42 మందిని హాస్పిటల్‌కు తరలించారు. వీరి శాంపిల్ కలెక్ట్ చేసిన అనంతరం ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.