వలస కార్మికుల నడక కొనసాగుతూనేవుంది. లాక్ డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ లోని వలస కార్మికులకు పనిలేకుండాపోయింది. పూటగడవడం కష్టం కావడంతో వారంతా సొంతూళ్ల బాట పట్టారు. నారాయణ ఖేడ్ ప్రాంతంలో వలస కార్మికులు ఎక్కువగా వుంటారు. వీరంత పిల్లల్ని వెంటబెట్టుకుని ఎర్రటి ఎండలో స్వగ్రామాలకు నడిచి వెళ్తున్నారు. ఇలాంటి వారిని పోలీసుల వాహనాల్లో స్వగ్రామాలకు చేరవేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు శుక్రవారం కూడా భారీగా కనిపించాయి.