కరోనా బారిన పడకుండా ఉండేందుకు మరో చిట్కా.. డాక్టర్ సూచన

Update: 2020-03-28 15:07 GMT

చేతులు కడుక్కోండి, ముక్కుకి మాస్కులు పెట్టుకోండి, డిస్టెంన్స్ మెయింటైన్ చేయండి ఇది కరోనా పడకుండా ఉండేందుకు ఓ లిస్టు. దీంతో పాటు మరొకటి కూడా చేయమని సూచిస్తున్నారు విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. కరోనాను కట్టడి చేసేందుకు గొడుగులు బాగా ఉపయోగపడతాయని ఆయన వెల్లడిస్తున్నారు.

సోషల్ డిస్టెంన్స్ పాటించమంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచన మేరకు దాన్ని అమలు పరచాలంటే ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు గొడుగు వేసుకుని వస్తే ఒకరికొకరు కనీసం మీటరు దూరం పాటించినట్లవుతుందని ఆయన సలహా ఇస్తున్నారు. ఎదుటి వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము వంటి వాటి నుంచి వచ్చే తుంపర్ల బారిన పడకుండా ఉండొచ్చని ఆయన అంటున్నారు.

గొడుగు వర్షాన్నుంచే కాదండి వైరస్ నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది అన్న డాక్టర్ సూచనను పాటిస్తే కొంత వరకైనా మనల్ని మనం కాపాడుకున్నవారం అవుతాం. మరో ముఖ్య విషయం గొడుగు వేసుకుని బయటకు వెళ్లి వచ్చిన వెంటనే దాన్ని ఎండలోనే కొద్ది సేపు ఉంచి లోపల పెడితే మంచిది అని డాక్టర్ సూచన.

Similar News