గ్యాస్ డెలివరీ బాయ్స్ కు ఆయా సంస్థలు తీపికబురు అందించాయి. గ్యాస్ డెలివరీ బాయ్‌లు, పంపిణీతో సంబంధం ఉన్న వారెవరైనా కరోనాతో మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రకటించాయి. లాక్‌డౌన్ సందర్భంగా దేశంలో అందరూ ఇళ్లకే పరిమితం కాగా, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, వేల మంది డెలివరీ బాయ్‌లు గ్యాస్ పంపిణి చేస్తూ.. వాళ్ళ జీవితాలు రిస్క్ లో పెడుతున్నారు అందుకే.. ఆయా సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.