కరోనావైరస్ : అమెరికాలో 3వేలు దాటిన మరణాలు

Update: 2020-03-31 10:21 GMT

కరోనావైరస్ మహమ్మారి అమెరికాను మరింతగా భయపెడుతోంది. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 3,000 దాటింది, సోమవారం ఒకేరోజు 540 మరణాలతో మొత్తంగా 3,017 ను తాకింది, అలాగే నివేదించబడిన కేసులు సంఖ్య 163,000 కు చేరుకున్నాయని రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు కరోనా పంజా విసురుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.

కరోనా కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సోషల్ జస్టిస్ ను పాటించాల్సిందేనని సూచించారు. ఇదిలావుంటే కరోనా నివారణ కోసం ప్రభుత్వ ప్రణాళికలు - వ్యూహాన్ని ట్రంప్ ఈరోజు వెల్లడించే అవకాశం ఉన్నట్టు అగ్రరాజ్య మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ఆ దేశంలో 2 లక్షల మందికి వ్యాధి సోకినట్లు వైట్ హౌస్ అంచనా వేస్తోంది.

Similar News