క్వారంటైన్ కేంద్రాలుగా స్టార్ హోటళ్లు

Update: 2020-03-31 23:48 GMT

కరోనా వైరస్ దేశంలో విజృభిస్తుంది. ఈ కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తుంది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తాయి. అయినా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

స్టార్ హోటళ్లనూ అదనంగా సెల్ఫ్ ఐసోలేషన్ సౌకర్యాలతో క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు ఒడిశా సర్కారు సిద్దమైంది. దీనికోసం భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న 12 హోటళ్లలో క్వారయింటైన్‌కు అవసరమయ్యే ఏర్పాట్లు చేసింది. ముందుజాగ్రత్తగా 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునే వారు డబ్బులు చెల్లించి ప్రైవేటు హోటళ్లలోనూ ఉండొచ్చని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. హోటళ్లలో రోజుకు రూ.2,500 ల చొప్పున చెల్లిస్తే క్వారంటైన్‌ గదిలో వసతితోపాటు బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్, రెండు వాటర్ బాటిళ్లను అందించనున్నట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు50 హోటళ్లను క్వారంటయిన్ కేంద్రాలుగా మార్చారు.

Similar News