ఏపీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కసారిగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్న రాత్రి 10 గంటలనుంచి ఉదయం వరకు కొత్తగా 31 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కు పెరిగింది. అయితే ఇందులో ఢిల్లీ ముర్ఖజ్ తో లింక్ ఉన్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ప్రకాశం 17 , కడప 15 , కృష్ణా 15 , పచ్చిమగోదావరి 14 , తూర్పు గోదావరి 9 ,విశాఖపట్నం 9 , చిత్తూరు 8 , అనంతపురం 2 , కర్నూలు 1 కేసు నమోదయింది.