సీఎం జగన్ మాటలు వింటే.. ప్రజల ఆరోగ్యం పట్ల సీఎంకు ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోందని మాజీ మంత్రి యనమల ఎద్దేవా చేశారు. కరోనాపై సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని విమర్శించారు. కరోనా జ్వరంలాంటిదేనని, భయంలేదని సీఎం జగన్ ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచేలా జగన్ మాట్లాడలేదన్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆర్థిక కష్టాలను అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని సూచించారు. కరోనాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ యథేచ్చగా అక్రమాలు సాగిస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.