మానవహక్కుల సంఘాలు ఏమైపొయ్యాయి: హరీష్ శంకర్

Update: 2020-04-03 15:07 GMT

రెండు రోజుల క్రితం గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ బంధువులు వైద్యసిబ్బంది పై దాడి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ డైరక్టర్ హరీష్ శంకర్ మానవ హక్కుల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి వారు బాధితులకు వైద్య సహాయం అందిస్తుంటే డాక్టర్లనే తప్పు పడుతుంటే చూస్తూ ఊరున్నారేమిటి.. ఆమధ్య జరిగిన ఓ సంఘటనకు పోలీస్ కమీషనర్ సజ్జనార్ త్వరితగతిన యాక్షన్ తీసుకున్నందుకు ఆయన్ని తప్పుబట్టిన మానవసంఘాలు ఇప్పుడేమైపోయాయి అని హరీష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు.. మనుషులు కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాగా, వైద్య సిబ్బందిపై పేషెంట్ బంధువులు సీరియస్ అవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

Similar News