15 రోజుల్నించి రైలు బండి కూత లేదు.. బస్సు హారన్ మోత లేదు. ఎక్కడి వాళ్లక్కడే గప్ చిప్. ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఊర్లో ఉన్న అమ్మమ్మ తాతయ్యలతో కరోనా కబుర్లు తప్పించి ఇంకో మాట లేదు పిల్లలకి సైతం. ఈ నేపథ్యంలో ఓ శుభవార్త తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఏప్రిల్ 15 నుంచి రైల్వే బుకింగ్‌లు ప్రారంభమవుతాయని. దీన్ని బట్టి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఏమాత్రం లేవనేది స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తామని, అయితే ప్రయాణికులను ఇప్పుడే అనుమతించరనేది అందిన సమాచారం.